జగిత్యాల : జగిత్యాల(Jagityala )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సు( Private bus) ద్విచక్రవాహనాలను ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల రూరల్ మండలం పోలస వద్ధ చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలను బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్స్ లోనే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, టూ వీలర్ పై నుంచి బస్సు వెళ్లడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జు నుజ్జు అయ్యాయి. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగా త్రులను జగిత్యాల జిల్లా హాస్పిటల్కు తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.