Road Accident | యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి – బొమ్మపల్లి చౌరస్తాలో ఓ ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఆరుగురు యాదగిరిగుట్ట దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన ఇన్నోవా నంబర్.. ఏపీ 09 బీఎన్ 5568.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | మెదక్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. 40 నిమిషాల పాటు ప్రయాణికులకు నరకయాతన
Harish Rao | ముఖ్యమంత్రి గారూ.. వారి ఆవేదనను అర్థం చేసుకోండి : హరీశ్‌రావు