Hero Suman | యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ కితాబిచ్చారు. గురువారం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సమయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు స్వామి వారిని దర్శించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం పూర్తయిన తర్వాత దేవుని దర్శించుకోవడం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ శైలిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనువిందుగా, రమణీయంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఆలయ పరిశుభ్రతను ఆయన మెచ్చుకున్నారు. పారిశుద్ధ్యంపై భక్తులు సైతం సహకరించాలని సుమన్ కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..! కేటీఆర్ ఫైర్
KTR | అస్తిత్వ ఉద్యమాలకు.. ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ కుమ్రం భీం: కేటీఆర్