KTR | అస్తిత్వ ఉద్యమాలకు.. ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ కుమ్రం భీం: కేటీఆర్
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడని, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ అని చెప్పారు.
హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడని, గోండు బెబ్బులి కుమ్రం భీం 84వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ అని చెప్పారు. ఉద్యమ బాటలో, ఉజ్వల ప్రగతి దారిలో జల్.. జంగల్.. జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామని తెలిపారు. కొండల్లో కోనల్లో వున్న ప్రతి గూడేనికి, తండాకు స్వచ్ఛమైన మంచినీళ్ల సరఫరాతో విష జ్వరాల చావుల నుంచి విముక్తి కల్పించామని వెల్లడించారు.
4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై హక్కులు కల్పిస్తూ.. అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేశామని గుర్తుచేశారు. మావనాటే మావరాజ్.. ‘మా గూడెంలో మా తండాలో మా రాజ్యం’ ఆకాంక్ష స్వరాష్ట్రంలో నెరవేరిందని చెప్పారు. 2,471 గిరిజన పంచాయతీల్లో స్వయం పాలనా జెండా ఎగిరిందన్నారు. అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం సముచిత వాటా దక్కేలా గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 188 గురుకుల పాఠశాలలు, 125 గురుకుల ఇంటర్ కాలేజీలు, 22 గురుకుల డిగ్రీ కళాశాలలతో అడవి బిడ్డల విద్యా వికాసానికి నిబద్ధతతో కృషి చేశామని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ తో విదేశీ చదువుల కలలు సాకారం, గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన సీఎంఎస్టీఈఐ స్కీం, ఆ మహనీయుని పేరుతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన కుమరం భీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్లు గిరిజన అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచాయని తెలిపారు. గిరిజన సంస్కృతికి గొప్ప గౌరమైన సమ్మక్క సారక్క జాతర, నాగోబా, జంగుబాయి, చెంచుల బౌలాపూర్, ఎరుకల నాంచారమ్మ, గాంధారి మైసమ్మ, కొలాం పండుగలకు భారీగా నిధులు విడుదల చేశామని, అధికారికంగా నిర్వహించామని వెల్లడించారు. అస్తిత్వ ఉద్యమాలకు, ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ అందించే రణధీరుడు కుమ్రం భీంకు ఎక్స్ వేదికగా జోహార్లు అర్పించారు.
ఆదివాసీ యోధుడు..అరణ్య సూర్యుడు ! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ!
దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు ! గోండు బెబ్బులి ..కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు!
ఉద్యమ బాటలో..ఉజ్వల ప్రగతి దారిలో జల్ ..జంగల్ ..జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం… pic.twitter.com/MBw8ukz6Xz
— KTR (@KTRBRS) October 17, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

