KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..! కేటీఆర్ ఫైర్
KTR | తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మాఫియా పెట్రేగి పోతోంది. వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఇసుక మాఫియా పెట్రేగి పోతోంది. వాగుల నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇసుక మాఫియాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాండ్ మాఫియాకు అభయ హస్తంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు కొనసాగుతున్నాయన్నారు. బడా ఛోటా తేడా లేదు..మంత్రుల నుంచి మండల స్థాయి లీడర్ల దాకా ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అధికారులకు మామూళ్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటుంటే.. ఇక అడ్డగోలు తవ్వకాలను.. అక్రమ రవాణాను అడ్డుకునేవాడెవ్వడు..? నదులను.. వాగులను.. వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్ల జేబుల్లో నింపుకుంటున్నారు..! అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం..!
కాంగ్రెస్ పాలనలో శాండ్ మాఫియాకు అభయ హస్తం..!
రాష్ట్రంలో ఏ మూలన చూసినా విచ్చలవిడిగా ఇసుక దందాలు..!
బడా ఛోటా తేడా లేదు..మంత్రుల నుంచి మండల స్థాయి లీడర్ల దాకా ఇసుకను పిండి దండిగా ధనాన్ని దండుకుంటున్నారు !
అధికారులకు మామూళ్లు ఇచ్చి… pic.twitter.com/QtnYJRUpDe
— KTR (@KTRBRS) October 17, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అస్తిత్వ ఉద్యమాలకు.. ఆత్మగౌరవ పోరాటాలకు నిత్య ప్రేరణ కుమ్రం భీం: కేటీఆర్
KTR | పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. రేవంత్ ఢిల్లీ టూర్లపై కేటీఆర్ ఫైర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

