Tiger | ఆసిఫాబాద్ : తెలంగాణలో పెద్ద పులులు కలకలం సృష్టిస్తున్నాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఇక ఈ పులుల జాడ తెలుసుకునేందుకు ఆయా జిల్లాల పరిధిలోని అటవీ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం సృష్టించింది. పట్టపగలే రైలు పట్టాలు దాటుతూ ఓ పెద్ద పులి కెమెరాకు చిక్కింది. ఇక పట్టాలు దాటుతూ ఆ పులి అటుఇటు చూసింది. పట్టాలపై నడుచుకుంటూ ఓ వ్యక్తి పులి వైపు వెల్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పులి అటు నుంచి ముందుకు వెళ్లిపోయిన దృశ్యాలు కనిపించాయి.
రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే పులి సంచారంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద పులి కలకలం
రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పులి pic.twitter.com/OcLTqJ8BHg
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తిన్నాక పాన్ వేసుకున్నారా..? రూ. 32 వేల ప్లేట్ భోజనం అంటే అరగాలి కదా..? : కేటీఆర్
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది : హరీశ్‌రావు
Congress | కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం.. పెళ్లిపీటలపై ఆగిన ఐపీఎస్ వివాహం