KTR | హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని నిప్పులు చెరిగారు. కానీ లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టారని నిలదీశారు. అంతేకాకుండా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా.. సీఎం, మంత్రుల భోజనాల ఖర్చు నిమిత్తం.. ఒక్కో ప్లేటుకు రూ. 32 వేలు ఖర్చు చేసినట్లు వచ్చిన వార్తా కథనాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అడ్డగోలు అప్పులు, ఖర్చులను కేటీఆర్ ఎండగట్టారు.
ఒక్క ఇటుక పెట్టలేదు, గుప్పెడు మన్ను తియ్యలేదు.. కానీ లక్ష ఇరవై మూడు వేల కోట్ల అప్పు ఎందుకు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పు సరే కానీ భోజనాలు బాగా అయ్యాయా? అని వేములవాడ పర్యటన సందర్భంగా రేవంత్ సర్కార్ చేసిన ఖర్చును కూడా కేటీఆర్ ప్రస్తావించారు. అందరూ కడుపునిండా తిన్నారా..? తిన్నాక పాన్ వేసుకున్నారా? రూ. 32,000 ప్లేట్ భోజనం అంటే అరగాలి కదా? అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
ఒక్క ఇటుక పెట్టలేదు, గుప్పెడు మన్ను తియ్యలేదు!
కానీ లక్ష ఇరవై మూడు వేల కోట్ల అప్పు అంటే……!!!!!
అది సరే …భోజనాలు బాగా అయ్యాయా?
అందరూ కడుపునిండా తిన్నారా?తిన్నాక పాన్ వేసుకున్నారా?…₹ 32,000 రూపాయిల ప్లేట్ భోజనం అంటే అరగాలి కదా? pic.twitter.com/g775ZAxvcG
— KTR (@KTRBRS) December 18, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది : హరీశ్‌రావు
Congress | కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం.. పెళ్లిపీటలపై ఆగిన ఐపీఎస్ వివాహం
Pawankalyan | వైసీపీ పాలనలో జల్‌జీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం : పవన్‌కల్యాణ్