అమరావతి : గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జల్‌జీవన్ మిషన్ (Jaljeevan Mission) కింద కేంద్రం విడుదల చేసిన రూ. 4వేల కోట్లు దుర్వినియోగానికి గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawankalyan) ఆరోపించారు. జల్‌జీవన్ మిసన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో (Workshop) ఆయన మాట్లాడారు.
నీటి వనరులు లేకుండానే గ్రామంలో నీటిపైపులు వేసి వృథాగా మార్చారని వైసీపీని మండిపడ్డారు. ప్రతి ఒక్కరికి సురక్షిత మంచినీరు అందించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ. 76 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. రో
జుకు కనీసం సగటున 55 లీటర్లు నీటిని ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కలని గుర్తు చేశారు. రాష్ట్ర వాటాను అడిగితే గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జల జీవన్ మిషన్ అమలు కాలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయకత్వంలో నీటి సరఫరాపై దృష్టి పెట్టామన్నారు.
మానవతా దృక్పధంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. పైపు లైన్లు డిజైన్లు కూడా గందరగోళంగా ఉన్నాయని తెలిపారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా శాశ్వతమైన పరిష్కారం చూడాలని కోరారు.