Congress | గుంటూరు : కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్ పెళ్లికి అంగీకరించాడు.
గుంటూరు నగరానికి చెందిన ఐపీఎస్ అధికారితో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుమార్తెతో పెళ్లి నిశ్చయించారు. దీంతో డిసెంబర్ 17న సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు గుంటూరుకు తరలివచ్చారు. ఆ క్రమంలో పెళ్లి కుమారుడు ఇంటి నుంచి కాంగ్రెస్ జెండాలతో భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు నాయకులు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం మంచిది కాదని పార్టీ కేడర్‌ను ఐపీఎస్ బంధువులు వారించారు. అందుకు వధువు తరఫు బంధువులు ససేమిరా అన్నారు.
ఈ నేపథ్యంలో వరుడు ఐపీఎస్ అధికారి కావడంతో.. పార్టీ జెండాలు మంచిది కాదంటూ.. పెళ్లి కుమార్తె బంధువులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వధువు బంధువులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో యువ ఐపీఎస్ అధికారి ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఈ పెళ్లి చేసుకొనేందుకు ఐపీఎస్ అధికారి నిరాకరించాడు. ఈ విషయం తెలిసి.. పెళ్లి కుమార్తె తల్లికి తీవ్ర గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేడర్.. ఐపీఎస్ అధికారి నివాసం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
ఐపీఎస్ అధికారిని వివాహానికి ఒప్పించేందుకు.. చర్చి పెద్దలు, పాస్టర్లు చర్యలు చేపట్టారు. గత అర్థరాత్రి 12.00 గంటల నుంచి బుధవారం ఉదయం 7.00 గంటల వరకు చర్చలు జరిగాయి. చివరకు ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. బుధవారం.. అంటే ఈ రోజు సాయంత్రం.. అదే వివాహ వేదికగా పెళ్లి ముహూర్తం ఇరు వర్గాల పెద్దలు కలిసి నిశ్చయించారు. ఈ ఐపీఎస్ అధికారి గుజరాత్ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అదీకాక.. జిల్లాలో సదరు కాంగ్రెస్ నాయకుడికి భారీగా కేడర్ ఉంది. దీంతో తమ నాయకుడు కుమార్తె వేడుకకు వారంతా గుంటూరు తరలి వచ్చారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అసెంబ్లీ బయట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
Harish Rao | హరీశ్‌రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం.. శాసనసభ ప్రవేశ మార్గంలో పేపర్లు లాక్కున్న డీఎస్పీ
Union Minister | కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు.. ఎందుకంటే?