Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించారు. శాసనసభ ప్రవేశ మార్గం వద్ద హరీశ్‌రావును ఆపిన డీఎస్పీ సుదర్శన్.. ఆయన తీసుకెళ్తున్న పేపర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. కారు తనిఖీ పేరుతో హరీశ్‌రావు తీసుకెళ్తున్న పేపర్లను లాక్కున్నారు. డీఎస్పీ సుదర్శన్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం దుర్మార్గమంటూ పోలీసులపై మండిపడ్డారు. ఈ ఘటనపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇంతలా ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజా పాలనలో కంచెలు తొలగించామని అంటూనే.. పోలీసులతో అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. శాసనసభ ప్రవేశమార్గంలో తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ఉన్న ప్లకార్లులను మండలిలోకి అనుమతించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ప్లకార్డులను పోలీసులు, మార్షల్స్ లాక్కుని.. వారిని లోపలికి పంపించారు.
Brs Mlas
కాగా, ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఇవాళ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ క్రమంలోనే కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాకీ దుస్తులు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు.