Harish Rao | హైదరాబాద్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వచ్చే సభ్యులకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని.. ఆ అవినీతిని మేము నిరూపిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. సభ్యులపై ఆరోపణలు చేయొద్దని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు రూలింగ్ బుక్ చూపించి చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. సుద్దులు మాకు చెప్పడం కాదు వారి సహచర మంత్రికి కూడా చెప్పాలి.. వెంకట్ రెడ్డి కమీషన్ లిస్టు చదవమంటే నేను చదువుతాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొంతమంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని అన్నారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని హరీష్ రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | హరీశ్‌రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం.. శాసనసభ ప్రవేశ మార్గంలో పేపర్లు లాక్కున్న డీఎస్పీ
Virat Kohli: 14 ఏళ్లు నీతో కలిసి ఆడా.. భావోద్వేగానికి లోనవుతున్నా: విరాట్ కోహ్లీ