అమరావతి : కేంద్ర రక్షణ సహాయ మంత్రి సంజయ్సేథ్ ( Union Minister Sanjayseth) ప్రయాణిస్తున్న విమానానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ముందు జాగ్రత్తగా విమానాన్ని (Flight ) హైదరాబాద్కు దారి మళ్లించారు. నౌకాదళం హైడ్రో గ్రాఫిక్ సర్వేల కోసం ఉద్దేశించిన ఐఎన్ఎస్ నిర్దేశక్ ( INS Nirdeshak) నౌకను విశాఖ నావెల్ డాక్ యార్డ్లో ఉదయం జరగనున్న కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి ఆయన విమానాశ్రయంలో బయలు దేరారు.
విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో విమానాన్ని దారి మళ్లించడంతో కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కోల్కత్తాలోని జీఆర్ఎస్ఈలో దేశీయంగా 80 శాతం పరికరాలతో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన ఈ నౌకను రెండు ఇంజిన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రో గ్రాఫిక్(HydroGraphik), ఓషనో గ్రాఫిక్ సర్వే పరికరాలతో ఈ నిర్దేశక్ను తీర్చిదిద్దారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు సంబంధించిన రెండో నౌక ఇదే కావడం గమనార్హం
. గతంలో 32 ఏళ్ల పాటు భారత నౌకాదళంలో సేవలందించి 2014లో వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ స్ధానంలో ఈ కొత్త నౌక రూపుదిద్దుకుంది. 25 రోజుల పాటు నిరంతరాయంగా 18 నాట్ల గరిష్ట వేగంతో ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకత అని నౌక అధికారులు తెలిపారు.