రాజన్న సిరిసిల్ల : నక్క దాడి(Jackal attack )చేసిన ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల(Sircilla) జిల్లాముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూత్రపు రాధ అనే మహిళ ఇంటి ముందు అలుకు చల్లుతుండగా సమీప గుట్టల నుంచి వచ్చిన నక్క దాడి చేసి గాయపరిచింది.
కేకలు వేయాగా పక్కనున్న నీటి సత్తయ్య, కిషన్ వచ్చి నక్కపై కర్రతో కొట్టగా వారిపైన దాడి చేసి గాయపరిచింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా కలిసి నక్కను కొట్టి చంపేశారు. నక్క దాడిలో సూత్రం రాధ తీవ్రంగా గాయపడింది. సత్యం, కిషన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు.
ఇవి కూడా చదవండి..
Bhuvanagiri | భువనగిరిలో బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ.. భారీగా మోహరించిన పోలీసులు
Leopard | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత సంచారం
Rythu Bharosa | సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా.. 26 నుంచి నిధులు పంపిణీ