Rythu Bharosa | హైదరాబాద్ : రైతు భరోసా మార్గదర్శకాలను కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదికి ఎకరాకు రూ. 12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొంది. భూభారతిలో నమోదైన సాగు యోగ్యమైన భూములకే రైతుభరోసా ఇస్తామని స్పష్టం చేసింది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా అందనుంది. సాగుయోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా వర్తించనున్నట్లు తెలిపింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
రైతు భరోసా పై మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం pic.twitter.com/NYdG0tAR1f
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2025
ఇవి కూడా చదవండి..
Paddy Crop | యాసంగి వరి పంటపై తెగుళ్ల బెడద.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే..!
Rythu Bandhu | రైతుబంధు వృథా అని నిరూపిస్తరా? రైతులను దొంగలుగా చిత్రీకరిస్తారా?