64వసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో బుధవారం భేటీ అయ్యారు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోం మంత్రిని కలిశారు.
- కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కీలక భేటీ
- సీఎంతోపాటు డీజీపీ, ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ చీఫ్‌లు
- మావోయిస్టుల లొంగుబాటుపై వివరాలు అందజేత
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో బుధవారం భేటీ అయ్యారు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతితో కలిసి బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర హోం మంత్రిని కలిశారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ముందు మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డి, దామోదర్, నూనె నర్సింహారెడ్డి తదితరులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతల లొంగుబాటుకు సంబంధించిన వివరాలను అమిత్‌షాకు అందించినట్టు తెలిసింది. ఈ భేటీలో నేతల లొంగుబాటుకు సంబంధించి కీలక చర్చ జరిగినట్టు సమాచారం.మార్చి 31న ఢి ల్లీలో నిర్వహించనున్న మావోయిస్టు రహిత భారత్ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన అంశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే, మావోయిస్టు ఆగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో లొంగిపోయినట్టు ప్రచారం జరిగింది. అందుకే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి ఢిల్లీకి వచ్చారనే ప్రచా రం జరిగింది. కానీ, గణపతి లొంగుబాటు లేదని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం ఇది 64వసారి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

