Bhuvanagiri | భువనగిరిలో బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ.. భారీగా మోహరించిన పోలీసులు
Bhuvanagiri | బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా.. బీఆర్ఎస్ తలపెట్టిన మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Bhuvanagiri | యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా.. బీఆర్ఎస్ తలపెట్టిన మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతలను హౌజ్ చేశారు. పలువురు నాయకులను ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భువనగిరిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇవాళ ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేష్‌ను హౌజ్ అరెస్టు చేశారు.
యాదాద్రి జిల్లాలో అన్ని మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అక్రమ అరెస్టులకు తెర తీశారు. అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రౌడీలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు తమపట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలో జరిగే ధర్నా కార్యక్రమం విజయవంతం చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఆలేరులో మున్సిపల్ చైర్మన్ శంకరయ్యను హౌస్ అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బీఆర్ఎస్ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీశ్‌రావు
Rythu Bharosa | సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా.. 26 నుంచి నిధులు పంపిణీ
Leopard | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత సంచారం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

