Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే మల్లన్న భక్తులకు అన్నప్రసాద వితరణ సేవా భాగ్యం కలుగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని మల్లికార్జున నిత్యాన్నదాన సత్రం, టీజీ లక్ష్మీ వెంకటేష్ భవన్ అధ్యక్షులు మిడిదుడ్డి శ్యాంసుందర్ అన్నారు. కార్తీకమాసం శ్రీశైలం క్షేత్రానికి వచ్చే యాత్రికులతోపాటు పోలీస్ సిబ్బంది, శివసేవకులు, దేవస్థాన సిబ్బందికి ప్రత్యేకంగా అల్పాహార భోజన వసతులు కల్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాతల సహకారంతో నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు సుమారు 2000 వేల మందికి పైగా సత్రంలో అన్నప్రసాదాన్నిస్వీకరిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు శ్రీశైలం క్షేత్రంలో టీజీ లక్ష్మీవెంకటేష్ భవన్ నిర్మించి భక్తులకు చేస్తున్న అన్నదాన కార్యక్రమాలు ఆదర్శనీయంగా ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి యేటా కార్తీకమాసంలో ప్రత్యేక విధులు నిర్వహించేందుకు ఇక్కడికి వస్తున్న వివిధ శాఖల అధికారులు సిబ్బందికి ఆదరాభిమానాలతో కూడిన అల్పాహార భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నందుకు సత్ర నిర్వాహకులకు పాదాభివందనాలు చెప్పుకుంటున్నారు. పగలు రాత్రి నిరంతరం విధి నిర్వహణలో అలసిపోయినవారికి ఎంతో రుచికరమైన వంటకాలతో ఆకలి తీరుస్తున్న అన్నదాతలు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో భాసిల్లాలని మనసారా దీవించి వెళ్లున్నారు. ఉదయం రెండు లేదా మూడు రకాలుగా టిఫిన్లు, మధ్యాహ్నం అన్నం, పప్పు, కర్రి, సాంబారు, రసం, స్వీటు, బజ్జీలు, అప్పడాలు, పెరుగు, పచ్చడి, పొడులు, నెయ్యి వేసి అప్యాయంగా అడిగి మరీ ఇంకా కావాలా అంటూవడ్డించే తీరుతో ఆనంద పరవశులవుతున్నారు. అన్న ప్రసాదాలను తీసుకుంటున్న ప్రతిసారి సత్రం స్థాపించిన వారిని పలు విధాలుగా కొనియాడుతున్నారు.
నిత్యాన్నదాన సత్రం అంటే ఈ విధంగా ఉండాలని.. టీజీ లక్ష్మివెంకటేష్ గారి పేరుతో ఉన్న సత్రాన్ని ఆదర్శప్రాయంగా చర్చించుకుంటున్నారు. దేవస్థానం సిబ్బందిలో కొందరు, స్థానికులు, యాత్రికులతో సహా ప్రత్యేక విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సహా ఒక్కో పూటకు సుమారు 800 మంది నుండి 1000 మంది వరకు అన్న ప్రసాదాలను స్వకరించే మహత్కార్యాన్ని తలపెట్టిన సత్రం నిర్వాహకులకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ఆశిస్సులు కలుగుతాయని భక్తులు వాపోయారు.
తెలంగాణ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో వ్యాపారాలు నిర్వహించుకునే పలువురితో కలిసి శ్రీశైలం క్షేత్రంలో నిత్యం అన్నదానం చేయాలనే సంకల్పం ముందుకు వెళ్తున్నాము. మల్లన్న భక్తులకు సేవచేసుకునే భాగ్యాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. క్షేత్రంలో భక్తులకు సేవలందించేందుకు మాకు అవకాశం కల్పించిన దేవస్థానం అధికారులు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరిన్ని సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Srisailam | సిప్లైన్ ట్రయల్ రన్ విజయవంతం : కలెక్టర్ రాజకుమారి గణియా
ATMs | డిజిటల్ లావాదేవీల ఎఫెక్ట్.. 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత