అమరావతి : వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుందని, వారందరూ జైలుకు (Jail ) వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ( Minister Ramprasad Reddy) పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.
ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ (Assembly) సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడితే జగన్ (YS Jaan) రాయలసీమ బిడ్డగా ఒప్పుకుంటామని పేర్కొన్నారు. విలాసవంతమైన భవనాల్లో గడిపే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు చంద్రబాబును విమర్శించే హక్కు లేదని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తరువాత రాజకీయాల్లో ఆ స్థాయిలో పవన్‌కల్యాణ్ రాణిస్తున్నారని ప్రశంసించారు.