TGSRTC | హైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థికి గుండెనొప్పి వచ్చింది. బాధిత విద్యార్థికి సకాలంలో వైద్యసాయం అందించి, ప్రాణాలు కాపాడిన సిబ్బందిని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. భైంసా డిపోకు చెందిన కండక్టర్ జి గంగాధర్, అద్దె బస్సు డ్రైవర్ బి గంగాధర్‌ను హైదరాబాద్ బస్ భవన్లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ ఘనంగా సన్మానించి.. నగదు బహుమతులను అందజేశారు.
ఈ నెల 9న భైంసా నుంచి నిర్మల్‌కు వెళ్తున్న బస్సులో ఓ 12 ఏళ్ల విద్యార్థి కిరణ్‌కు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ గంగాధర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపించారు. డ్రైవర్ గంగాధర్‌తో కలిసి ప్రాథమిక చికిత్సను అందించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటనే కిరణ్‌ను బస్సులోనే సమీపంలో ఉన్న నర్సాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల కిరణ్‌కు ప్రాణాప్రాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
సమయస్ఫూర్తితో వ్యవహారించి 12 ఏళ్ల విద్యార్థి ప్రాణాలను కాపాడిన డ్రైవర్ గంగాధర్, కండక్టర్ గంగాధర్‌లను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారికి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ఫ, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీదేవి, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, బైంసా డిపో మేనేజర్ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | యూట్యూబ్‌లను చూస్తే రేవంత్ రెడ్డి వెన్నులో వణుకు : హరీశ్‌రావు
Peddapally | గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు.. హాస్పిటల్‌కు తరలింపు
Harish Rao | శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు