పెద్దపల్లి : కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు(Gurukula schools )సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొం టున్నాయి. మొన్న సిర్పూర్(టీ) సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాలలో 34 మంది విద్యా ర్థులు విష జ్వరాలతో మంచం పట్టారు. నిన్న గురుకుల భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని గేటుకు తాళం వేశాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా నాగవరంలో చోటుచేసుకున్నది.
నేడు ఓ విద్యార్థి పాముకాటుకు గురవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్ను గురుకుల సిబ్బంది కరీంనగర్లోని ఓ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థికి పాము కాటు.
కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/XxLuOnOclY
— Telugu Scribe (@TeluguScribe) September 11, 2024