Group-3 | హైదరాబాద్ : ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్-3 పరీక్షల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
గ్రూప్ -3లో మొత్తం మూడు పేపర్లున్నాయి. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో, తిరిగి సోమవారం ఉదయం సెషన్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీఎస్ పేపర్, మధ్యాహ్నం సెషన్లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేపర్లకు పరీక్షను నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం సెషన్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్‌కు పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
Jagithyala | గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పై దాడి.. భయాందోళనలకు గురైన విద్యార్థినులు
KTR | రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు.. పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు : కేటీఆర్
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది.. రేవంత్‌ను హెచ్చరించిన కేటీఆర్