జగిత్యాల : గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌పై(Gurukula principal) భర్త, ఆమె తమ్ముడు దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్(Jagithyala) మండలం లక్ష్మీపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీపూర్‌లోని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మమతపై భర్త సంపత్, ప్రిన్సిపాల్ తమ్ముడు రాజశేఖర్ దాడికి పాల్పడ్డారు. విద్యార్థినిలు, స్టాఫ్ సమక్షంలోనే కుటుంబ సభ్యులు చితకబాదడంతో విద్యార్థినిలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నుంచి తప్పించుకొని ప్రిన్సిపాల్ మమత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, అనుమానం, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పై దాడి చేసిన భర్త, తమ్ముడు
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల ప్రిన్సిపాల్ మమతపై దాడికి పాల్పడ్డ భర్త సంపత్, ప్రిన్సిపాల్ తమ్ముడు రాజశేఖర్
విద్యార్థినిలు, స్టాఫ్ సమక్షంలోనే చితకబాదిన కుటుంబసభ్యులు.. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థినిలు… pic.twitter.com/8W3Bu3RQqU
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది.. రేవంత్‌ను హెచ్చరించిన కేటీఆర్
KTR | కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి.. కేవలం బీఆర్ఎసోళ్లనే జైల్లో వేశారు : కేటీఆర్
Lingaiah Yadav | రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దులేకుండా పోయింది : మాజీ ఎంపీ బడుగుల