హైదరాబాద్ : రాష్టంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) అరాచకాలకు హద్దేలేకుండా పోయిందని, ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్( Badugula Lingaiah Yadav) అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే కక్ష కట్టి అరెస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని మండిడ్డారు.
మంత్రులు బాంబులు పేలతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరికి భయపడరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్రను ఎవరు చేరపలేరన్నారు. సీఎ ఆయన మాట్లాడే విధఠానం మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలను మరచి.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రత్యర్థుల కట్టడిపై దృష్టి పెట్టారన్నారని విమర్శించారు.
లగిచెర్లలో రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే ఎవరూ ఊరుకోరన్నారు. కేసీఆర్, కేటీఆర్కు ఏం జరిగినా ప్రజా పోరాటం తప్పదని, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం భగ్గుమంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఉప్పల ఆనంద్, నెమ్మది భిక్షం, తూడి నర్సింహా రావు, బండారు రాజా, తదితరులు పాల్గొన్నారు.