KTR | సంగారెడ్డి : ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేం అధికారంలోకి వచ్చాన నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు అని రేవంత్‌ను హెచ్చరించారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, సిగ్గులేకుండా రాజకీయ రంగు పులిమి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అరెస్టు అయిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఉన్నారు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారు. కొడంగల్ ఎస్సై, సీఐ, వికారాబాద్ ఎస్పీ కలిసి మూడు గంటల పాటు కొట్టారు. బాధితుల కాళ్లు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మెజిస్ట్రేట్ ముందు మిమ్మల్ని కొట్టినట్టు మీరు చెప్తే మళ్లీ కొడుతాం.. మీ ఇంటోళ్లను కూడా కొడుతామని హెచ్చరించారట. అమానవీయంగా, క్రూరంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదుల కోసం ఎలా ఆపరేషన్ చేస్తారో.. అలా లగచర్లలో ఇంటింటి తలుపులు పగులగొడుతూ.. కొందరు ప్రయివేటు వ్యవక్తులు బూతులు మాట్లాడుతూ దాడులకు పాల్పడ్డారు. పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారు. రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవాలి.. ఈ భూమ్మీద ఎవరూ కూడా శ్వాతం కాదు.. నీ పదవి ఐదేండ్లు మాత్రమే. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేపోఎల్లుండో తీసేస్తే దిక్కు లేదు నీకు. ఒకటే గుర్తు చేస్తున్నా.. నీవు రాజు, చక్రవర్తివి కాదు. ఒకటి మాత్రం పక్కా ఎస్సీ, ఎస్టీ, బీసీ సన్నకారు రైతుల భూములు గుంజుకుంటా.. మా అల్లుడికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే తెలంగాణ సమాజం తిరగబడితది.. ఇప్పుడు కొడంగల్ మర్లబడ్డది.. రేపు తెలంగాణ మర్లబడతది అని కేటీఆర్ హెచ్చరించారు.
మేం అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు. ఇవాళ జైల్లో పెట్టిన 21 మంది కుటుంబాల ఉసురు నీకు తప్పకుండా తగలుతది. బాధిత రైతులకు, వారి కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటది. బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తాం. రాఘవేంద్ర యాదవ్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కూడా అరెస్టు చేసి జైల్లో వేశారు. రేవంత్ మెడలు వంచి అతనికి ఉద్యోగం ఇప్పిస్తాం.. అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. నీ ఉద్యోగం పోనివ్వం. తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. ప్రజాస్వామ్యబద్దంగా కొట్లాడుదాం. న్యాయ స్థానాల్లో పోరాటం చేసి బయటకు తీసుకువస్తామని భరోసా ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి.. కేవలం బీఆర్ఎసోళ్లనే జైల్లో వేశారు : కేటీఆర్
Lingaiah Yadav | రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దులేకుండా పోయింది : మాజీ ఎంపీ బడుగుల
Nirmal | ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం : వీడియో