నిర్మల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో( Khanapur forest) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, సాయంత్రం త్వరగా ఇండ్లకు చేరుకోవాలని చూసుకోవాలని సూచించారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం
భయాందోళనలో ప్రజలు. pic.twitter.com/Dw8DihRG7A
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024
ఇవి కూడా చదవండి..
KTR | పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందట.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
SCR | అయ్యప్ప భక్తుల కోసం.. ఈ నెల 17 నుంచి ఎస్సీఆర్ 26 ప్రత్యేక రైళ్లు
High Blood Pressure | చలికాలంలో హైబీపీ ఉన్నవారు జాగ్రత్త.. బీపీని ఇలా కంట్రోల్ చేయండి..!