హైదరాబాద్: పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిన చందంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, కిరాయిలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారని విమర్శించారు. కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని మండిపడ్డారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయిందని విమర్శించారు. అభివృద్ధి దూరమయిందని, కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుందన్నారు.
‘పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట. సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారు. కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారు. 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు. వందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.
పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయింది. అభివృద్ధి దూరమయింది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుంది.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట
సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారు
కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు
11 నెలల పాలనలో… pic.twitter.com/p4dy75dFL6
— KTR (@KTRBRS) November 15, 2024