KTR | సంగారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మాతో కొట్లాడు.. రాజకీయంగా తలపడు కానీ పేదలకు మాత్రం కష్టం కలిగించొద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. లగచర్ల రైతులపై నమోదు చేసిన కేసులన్నీ రద్దు చేసి, వెంటనే వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులతో ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ శివార్లలో ఫార్మాసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ల కుటుంబ సభ్యుల కోసం మార్చారు. లగచర్లతో పాటు సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో కూడా రైతులు పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ మీకు అండగా ఉంటారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటాం.. ఈ ప్రభుత్వానికి తప్పకుండా పేదవాడి ఉసురు తగులతది. 30, 40 కిలోల బరువు లేని పిల్లలు కలెక్టర్‌పై హత్యాయత్నం చేశారని కేసులు పెట్టడానికి మనసు ఎలా ఒప్పింది రేవంత్ రెడ్డి..? చేతనైతే మాతో కొట్లాడు. రాజకీయంగా మాతో తలపడు. పేదలకు కష్టం కలిగించొద్దు. ఈ కేసులన్నీ రద్దు చేసి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు, పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. గర్భిణి అయిన జ్యోతిని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రేపు హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుంది. పేద వర్గాలకు అండగా నిలబడడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇప్పుడు కొడంగల్ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడతది.. రేవంత్‌ను హెచ్చరించిన కేటీఆర్
KTR | కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి.. కేవలం బీఆర్ఎసోళ్లనే జైల్లో వేశారు : కేటీఆర్
Lingaiah Yadav | రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దులేకుండా పోయింది : మాజీ ఎంపీ బడుగుల