TGPSC | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా వేసినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటించారు. అయితే ఈ నెల 26న నిర్వహించాల్సిన పేపర్ కోడ్ 141 పరీక్షను డిసెంబర్ 8కి వాయిదా వేశారు. పేపర్ కోడ్ 19, 28కి సంబంధించి డిసెంబర్ 2న నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్ 7కి వాయిదా వేశారు. ఈ నెల 30 నుంచి అభ్యర్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అందుకోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు. అయితే డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్లు భద్రపరుచుకోవాలని, అది పోతే డుప్లికేట్ హాల్టికెట్ జారీ ప్రక్రియ ఉండదని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ (www.tspsc.gov.in) అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ పరీక్షా ఫీజు స్వీకరణ
Konda Surekha | నాగార్జున కేసులో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
Silver-Gold Rates | వెండి ధర భారీగా కోత.. రూ.90 వేల దిగువకు.. స్వల్పంగా తగ్గిన బంగారం..!