Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండో సంవత్సరం (పార్ట్ – 2) రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 11వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Konda Surekha | మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు
Ayyappa Devotees | వెల్లివిరిసిన మతసామరస్యం.. అయ్యప్ప మాలధారులకు ముస్లింల భిక్ష
Jeevan Reddy | ఇది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన : మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి