TGPSC | హైదరాబాద్ : టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బుర్రా వెంకటేశం కమిషన్ పనితీరును మెరుగుపరిచేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా ఈ నెల 18 ,19 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు కమిషన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో పర్యటించనుంది. ఈ నెల 18న యూపీఎస్సీ, ఈ నెల 19న స్టాప్ సెలెక్షన్ కమిషన్ పనితీరుపై కమిషన్ బృందం అధ్యయనం చేయనుంది.
ఈమేరకు బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం యూపీఎస్సీ చైర్పర్సర్ ప్రీతి సూడాన్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్లతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మరింత విస్త్రత చర్చల కోసం ఢిల్లీకి వస్తామని చెప్పగా ఇందుకు వారు అంగీకరించారు. ఈ పర్యటనలో భాగంగా పరీక్షావిధానం, మూల్యాంకన ప్రక్రియ, ఎంపిక విధానాల్లో రెండుసంస్థలు అనుసరిస్తున్న పారదర్శక విధానాలను అధ్యయనం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Tatikonda Rajaiah | అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి.. తాటికొండ రాజయ్య డిమాండ్
Cold Wave | గ్రేటర్లో పెరిగిన చలి.. కనిష్టం @17.7డిగ్రీలు
Allu Arjun | సంధ్య థియేటర్ ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్