Allu Arjun | డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun)ను నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసు కొట్టివేయాలని పిటిషన్లో కోరాడు.
తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవలే ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ కూడా చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సెక్యూరిటీగార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ రూ.25 లక్షలు సాయం..
ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఇప్పటికే ఆమె రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు.
Akhanda 2 | అఖండ 2 వచ్చేది అప్పుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ టీం రిలీజ్ డేట్ ప్రోమో
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్