Akhanda 2 | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu). ఈ ఇద్దరి కలయికలో సింహా, లెజెండ్ తర్వాత వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది అఖండ. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్టు కొట్టిన బోయపాటి-బాలయ్య వన్స్‌మోర్ అంటూ అఖండ 2 (Akhanda 2)తో వస్తున్నారు. చాలా రోజుల తర్వాత షూటింగ్ అప్డేట్తోపాటు అఖండ 2 విడుదలపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు.
ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది అంటూ బాలకృష్ణ డైలాగ్స్, శివుడి తాండవం చేస్తున్న విజువల్స్‌తో సాగుతున్న ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ పార్ట్‌లో బాలకృష్ణ డ్యుయల్ రోల్లో నటించి గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టేశాడని తెలిసిందే. ఇక అఖండ 2లో ఎలాంటి రౌద్రరూపం చూపిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S Thaman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీక్వెల్‌ను కూడా మరో స్థాయికి తీసుకెళ్లబోతుందని ప్రోమో హింట్ ఇచ్చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఫస్ట్ పార్టులో ప్రగ్యాజైశ్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. మరి సీక్వెల్లో ఎవరెవరు కనిపించబోతున్నారన్నది తెలియాల్సి ఉంది.
రిలీజ్ డేట్ ప్రోమో..
The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 – Thaandavam shoot begins 💥💥
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/ci2JTKDsdb
— BA Raju’s Team (@baraju_SuperHit) December 11, 2024
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!