మహబూబ్నగర్ : రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకులంలో మరో విద్యార్థిని బలవన్మరణానికి(Student died) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ గురుకుల హాస్టల్లో(Govt hostel) పదో తరగతి చదువుతున్న ఆరాధ్య అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన సిబ్బంది వెంటనే షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Argentina | ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్జెంటీనా ఔట్
Bangladesh | బంగ్లాదేశ్లో మరోసారి హింస.. బంగబంధు ఇంటికి నిప్పు