Ponguleti Srinivas Reddy | కరీంనగర్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్ కలెక్టర్ పట్ల రుసరుసలాడారు. మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా.. ఆమెను కేంద్ర మంత్రుల ముందు అవమానించేలా మాట్లాడారు. కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కలెక్టర్ పమేలా సత్పతిపై నోరు పారేసుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీంతో కలెక్టర్ అవమానంగా ఫీలై, కార్యక్రమం ముగిసే వరకూ ముభావంగా ఉన్నారు.
కరీంనగర్లో కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్, హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రి పొంగులేటి.. కలెక్టర్ పమేలా సత్పతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. అసలు కామన్ సెన్స్ ఉందా..? అని కలెక్టర్ ముఖం చూస్తూ సీరియస్ అయ్యారు. ఎస్పీ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని.. కనీసం ఏసీపీ కూడా లేరని అన్నారు. కలెక్టర్‌పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోరు పారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రేకింగ్ న్యూస్
కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కరీంనగర్ మహిళా కలెక్టర్ మీద నోరు పారేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి pic.twitter.com/HVGmileoOF
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | పెన్నాకు గోదావరి నీళ్లు..? రేవంత్ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించిన హరీశ్‌రావు
Congress | నమ్మి మోసపోయినం మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడు.. పెన్షనర్ల ఆవేదన : వీడియో
AP News | కోరిక తీర్చాలని ఇంటికెళ్లి మరీ మహిళా ఉద్యోగిని అడిగిన అధికారి.. ఆఫీసుకొచ్చి చితకబాదిన భర్త