హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనపై(Congress) అన్ని వర్గాల ప్రజలు కన్నెర్రజేస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అలవిగాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారు. రైతుబంధు, తులం బంగారం పెన్షన్స్ పెంపు ఇలా అనేక రకాల హామీలు ఇచ్చి నిలువునా ముంచడంతో గుర్తించిన ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పెన్షన్ దారులు(Pensioners) తమ గోస వెళ్లబుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామన్నారు. అబద్ధాలతో పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడని ఘంటా పథంగా చెబుతున్నారు. ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు.
నమ్మి మోసపోయినం మళ్లీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెల్వడు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తమ గోస వెళ్ళబుచుకున్న పెన్షన్ దారులు pic.twitter.com/GWMKovy9n5
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2025