సంగారెడ్డి : పుట్టిన రోజు నాడే ఫిలిప్పీన్స్‌లో(Philippines) తెలంగాణ వైద్య విద్యార్థిని(Medical student dies) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేషం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ అనే విద్యార్థిని ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన స్నిగ్ధ పుట్టిన రోజే ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో చనిపోవడం కలకలం రేపింది. కాగా, విద్యార్థినీ తండ్రి చింత అమృత్ రావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు. స్నిగ్ధ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట