Telangana | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అమ్మాయిలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ 420 హామీలపై విద్యార్థినులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినప్పటికీ.. ఏ ఒక్క హామీ అమలు కాలేదంటూ.. ఎంపీ ప్రియాంక గాంధీకి విద్యార్థినులు వినూత్నంగా లేఖలు రాశారు. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. విద్యార్థినులకు తప్పకుండా స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీతో సభల్లో చెప్పించారని విద్యార్థినులు గుర్తించారు. ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమకు ఎప్పుడు స్కూటీలు ఇస్తారంటూ.. ప్రియాంక గాంధీకి పలు కాలేజీల విద్యార్థినులు పోస్టు కార్డులు రాశారు. గద్దెనెక్కి ఏడాదైనా.. స్కూటీలు ఇవ్వకుండా మోసం చేయడంతో రేవంత్ సర్కార్‌పై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు అపురూపంగా గాజులు తొడిగిన పూసలక్క
Kodangal Lift | కొడంగల్ ఎత్తిపోతల.. బలవంతపు భూసేకరణ ఆపాలి : సీపీఎం