TG Cabinet : ఈ నెల 4వ తేదీన తెలంగాణ (Telangana) క్యాబినెట్ సమావేశం (Cabinet Meeting) కానుంది. ఆగస్టు 4న మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రెటేరియట్ (Telangana secretariat) లోని ఆరో అంతస్తులో సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretory) కే రామకృష్ణారావు (K Ramakrishna Rao) తెలియజేశారు. ఈ మేరకు ఆయన పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.
క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు తమతమ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తన ప్రకటనలో ఆదేశించారు.