Tejashwi Yadav : బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తిచేసి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా (Draft voter list) లో తన పేరు లేదని ఆర్జేడీ అగ్రనేత (RJD top leader), బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్ (Tejashwi Yadav) చెప్పారు. ఓటర్ల జాబితాలో పేరు లేకుండా తాను ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలని ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తేజస్వి యాదవ్.. ముసాయిదా ఓటర్ల జాబితాలో లోపాలపై మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరు ఉందా లేదా..? అని చూసుకునేందుకు ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే వివరాలు రావడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపుగా 20 వేల నుంచి 30 వేల ఓట్లను తొలగించారని ఆరోపించారు.
ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను జాబితా నుంచి తొలగించారని తేజస్వి విమర్శించారు. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఈసీ ఇదే పని చేస్తోందని ఆరోపించారు.