Telangana Assembly | హైదరాబాద్ : ఏడో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాగా, స్పీకర్ అనుమతితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. రైతు భరోసా విధివిధానాలపై సూచనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల సభ్యులను కోరారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసాపై విధివిధానాలను ఖరారు చేసి, ఆ తర్వాత రైతు భరోసా చెల్లింపులు చేస్తామని మంత్రి ప్రకటించారు.
శాసనమండలి ముందుకు నాలుగు సవరణ బిల్లులు రానున్నాయి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సవరణ బిల్లులు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, భూ భారతి సవరణ బిల్లులు రానున్నాయి. ఇక హైదరాబాద్ అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. హైదరాబాద్లో ఏడాదిలో మౌలిక వసతుల కల్పనపై చర్చించాలని తీర్మానం ఇచ్చింది. మహాలక్ష్మీ పథకంపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
SE Vijay Bhasker Reddy | ఇరిగేషన్లో పంచముఖుడు.. ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడని అందలం!
Ponguleti Srinivas Reddy | పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక న్యాయం.. కేటీఆర్కు ఒక న్యాయమా?
HYDRAA | అరవై ఇండ్లకు హైడ్రా నోటీసులు.. ఆందోళనలో వెంగళరావునగర్ కాలనీ వాసులు