నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. వైద్యుడిగా సేవలందిస్తూనే తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ బాపు రెడ్డి(Doctor Bapureddy) క్రియాశీలకంగా(Telangana acitivist) పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమకాలంలో స్వరాష్ట్ర ఏర్పాటు కోసం అనేక కార్యక్రమంలో పాల్గొన్నారు . మృతి చెందే సమయానికి డాక్టర్ బాపురెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు. బాపురెడ్డిపై మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.