Renu Desai – Upasana | టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ మూగ జీవాల సంరక్షణ కోసం ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే ఒక ఎన్జీవో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాను ఎన్జీవోను స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఈరోజు కోసం నేను ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశానో నాకు మాత్రమే తెలుసు. నేను 8 ఏండ్ల వయసు నుంచే మూగ జీవాలను సంరక్షిస్తూ వస్తున్నా. ఇది ఎప్పుడు చేస్తునే ఉన్నాను. కానీ దానీ గురించి ఫోకస్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు. ఒక షెల్టర్ పెట్టాలని కానీ వాటి కోసం గళం వినిపించాలని కానీ ఆలోచించలేదు. కానీ కరోనా టైంలో మూగ జీవాలకు ఏదైనా చేయాలని నాకు అనిపించింది. అందుకే నేను సోంతంగా ఎన్జీవో పెట్టాలని అనిపించింది. ఫైనల్‌గా ఈరోజు నా ఎన్జీవోను రిజిస్టర్ చేయించా. మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్థిక సాయం చేయాలనుకునే వారు మా ఎన్జీవోకు డోనేషన్ ఇవ్వండి అంటూ రేణూ దేశాయ్ రాసుకోచ్చింది.
ఇక పోస్ట్ పెట్టిన అనంతరం మూగ జీవాలపై ప్రేమ ఉన్నవారు రేణూ దేశాయ్‌కి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana) కూడా రేణూ దేశాయ్ ఎన్జీవోకి తనవంతు సాయం చేశారు. మూగ జీవాల కోసం అంబులెన్స్ కోనుగోలు చేయగా.. ఇది కొనడానికి ఉపాసన సాయం చేసినట్లు రేణూ దేశాయ్ తెలిపింది. చరణ్ పెంపుడు కుక్క రైమీ పేరుతో ఈ విరాళంను ఉపాసన అందించినట్లు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Upasana – Renu desai