MLA Jagadish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని రంగాలకు అద్భుతంగా విద్యుత్ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు.. వారు అద్భుతంగా ఇస్తుంటే తాము అబద్దాలు మాట్లాడుతున్నట్లు వారు చెబుతున్నారు.. కానీ విద్యుత్ కోతలపై హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆగిపోతే.. పది నిమిషాలు రాకపోతే స్వయంగా నాకే ఫోన్లు వచ్చేవి. ఈ క్రమంలో సాయం లభిస్తుందని మేము హెల్ప్ లైన్ పెడితే.. ఆ హెల్ప్ లైన్ వాళ్ల మీద కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు. హెల్ప్ లైన్లో హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చివరికి జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు.. ఎక్కడైనా పోస్ట్ పెడితే ఆ ప్రాంతంలో విద్యుత్ సరి చేస్తారు కానీ, ఆ లైన్మెన్ ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి లేకుంటే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
చివరకు గాంధీ భవన్లో కూడా కరెంట్ పోయింది. కరెంట్ పోయిందని మాట్లాడడం నేరమైతే.. కరెంట్ కోతలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.. వారిపై కోపం చేశారు. మరి ఆయన మీద కేసు పెడుతారా..? ఇదేనా ప్రభుత్వం నడిపే విధానం..? మెదక్ జిల్లాలో కరెంట్ కోసం ధర్నాలు చేస్తే హరీశ్‌రావు చేయించిండు అంటరు. మేం చెప్తే అధికారులు వింటారా..? ఎంజీఎం, భువనగిరి ఆస్పత్రుల్లో కరెంట్ పోతే సెల్ ఫోన్ల లైట్ మధ్య వైద్యం చేస్తున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కరెంట్ పోకున్నా వారు వార్తలు రాస్తున్నారా..? అని జగదీశ్ రెడ్డి నిలదీశారు.
సాయం లభిస్తుందని మేము హెల్ప్ లైన్ పెడితే.. ఆ హెల్ప్ లైన్ వాళ్ల మీద కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు
హెల్ప్ లైన్లో హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
చివరికి జర్నలిస్టుల మీద కేసులు… pic.twitter.com/CSffwAYayM
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024
ఇవి కూడా చదవండి..