Jagadish Reddy | సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.. కానీ గొప్పలు చెప్పుకోవడంలో హస్తం పార్టీ ఆరితేరిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని రైతులు తరిమికొట్టేలా ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు. హుజుర్నగర్ నియోజకవర్గంలోని పాలకవీడులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వడ్లు కొనుగోళ్లలో మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కై దోచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులు ఉంటే అప్పుడు వాళ్ళకి రైతుల బాధ ఏమిటో తెలిసేది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గింది. గాలి లెక్కలు దొంగ లెక్కలతో.. గొప్పగా కొనుగోలు చేశామనే భ్రమలో బతుకుతున్నారు కాంగ్రెస్ మంత్రులు అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
మా ప్రభుత్వంలో దిగుబడి పెరిగింది.. ధాన్యానికి అధిక రేటు వచ్చింది.. ఇప్పుడు కనీసం ధర కూడా ఇవ్వడం లేదు. ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యానికి రేటు కూడా తగ్గి రైతులు తీవ్రంగా అప్పులు పాలవుతున్నారు. రోజుకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు ప్రజలకు తెలపాలి.. అప్పుడు కాంగ్రెస్ బాగోతం బయటపడుతుందన్నారు.
ఎవరెన్ని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం. బాహుబలి మోటర్లు ఆన్ చేసిన తర్వాతనే ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందింది. ఆ విషయం రైతులకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు చేసుకోవాలి.. కాంగ్రెస్ అంటేనే గ్రామాల్లో తరిమికొట్టేలా వున్నారు రైతులు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపై వేస్తారా? : కేటీఆర్