KTR | హైదరాబాద్ : కరెంట్ నిర్వహణ, సరఫరా చేతకాక ప్రజలను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి మరో తుగ్లక్ చర్యకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపై వేస్తారా..? అని కేటీఆర్ నిలదీశారు.
ఒక్కో అపార్ట్మెంట్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ. 3 లక్షలు కావాలని ప్రభుత్వం అడుగుతుందట. మధ్యతరగతి కుటుంబాలపై ఇది భరించలేని భారమవుతుంది. ఒక్క హైదరాబాద్ నగరవాసులపైనే అదనంగా రూ. 300 కోట్ల భారం పడుతుంది. పెరిగిన విద్యుత్ లోడ్‌ను సరిగ్గా నిర్వర్తించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. లోడ్ పెరిగిందని కారణం చూపుతూ అపార్ట్మెంట్ వాసులపై భారం వేస్తామంటే ఊరుకునేది లేదు. ప్రభుత్వమే కొత్తగా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Warangal | ముచ్చటగా మూడోసారి.. సీఎం రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
KTR | కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన కేటీఆర్