వరంగల్ : నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(Donthi Madhav Reddy) వైఖరి మారోసా హాట్ టాఫిక్‌గా మారింది. ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సభకు ఆయన డుమ్మా కొట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్ననీయాంశమైంది. తాజాగా వరంగల్‌లో నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్ససభకు ఆయన దూరంగా ఉన్నారు. దొంతి మాధవ రెడ్డి ఇంటి సమీపంలోనేకాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ మాత్రం సంబంధం లేనట్లుగానే ఇంటి వద్ద ఉండిపోయారు.
కాగా, గతంలో కూడా రెండు సార్లు వరంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా వెళ్లలేదు. దీంతో దొంతి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా పార్టీ మారతారనే చర్చ జోరుగా కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నాయకుడు అయినా దొంతి దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.