KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి..? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా సరిహద్దుల్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాల నేతలపై పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రజా సంఘాలకు చెందిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా..? అని కేటీఆర్ మండిపడ్డారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది..? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కొడంగల్‌కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటుచేశారని కేటీఆర్ తెలిపారు.
మీరెంత దాచే ప్రయత్నం చేసినా నిజం దాగదు.. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో మీ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే.. కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క అని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలి. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు..
పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా ??నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది ? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది ?
సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి ?…
— KTR (@KTRBRS) November 19, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఇప్పటి వరకు కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం చేయకపోవడం శోచనీయం : హరీశ్‌రావు
Harish Rao | సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం : హరీశ్ రావు
Harish Rao | విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరపండి : హరీశ్‌రావు