Harish Rao | హైదరాబాద్ : ఈ ఏడాదికి గానూ ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్‌కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ జయంతి సందర్భంగా నలిమెల భాస్కర్‌కు కాళోజీ అవార్డును ప్రదానం చేయాలి. కానీ ఇప్పటి వరకూ భాస్కర్‌కు అవార్డు ప్రదానం చేయకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాళోజి జయంతి నాడు సాహితీవేత్తలకు పురస్కారమిచ్చి, గౌరవించుకునే ఆనవాయితీని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గం. ఇది ఒక్క భాస్కర్‌కు మాత్రమే జరిగిన అవమానం కాదు. తెలంగాణ కవులందరికీ జరిగిన అవమానం. ఈరోజు కాళోజి కళాక్షేత్రం ప్రారంభించిన సందర్భంగానైనా భాస్కర్‌కు అవార్డు ప్రదానం చేయండి. చేసిన తప్పును సరి చేసుకోండి అని రేవంత్ సర్కార్‌కు హరీశ్‌రావు సూచించారు.
హనుమకొండలో కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. కళాక్షేత్రం ముందు కాళోజీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి..
Patnam Narender Reddy | పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
Khammam | విషాదం.. గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి?
Lagacharla | మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం.. దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత