ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గెండెపోటుతో( Heart attack) నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలోని ఎంవీపాలెంలో చోటు చేసుకుంది. అప్పటివరకు సరదాగా ఆడుకున్న చిన్నారి ప్రహర్షిక (4) ఒక్కసారిగా కుప్పకూలింది. నిన్న తల్లి లావణ్య గ్రూప్-3 ఎగ్జామ్స్ రాసి ఇంటికి రాగా ప్రహర్షిక పరిగెత్తుకుంటూ వెళ్లి కిందపడింది. ఏమైందని తల్లి అడగ్గా ఛాతిలో నొప్పివస్తోందని చెప్పి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. వెంటనే పాపను తల్లిదండ్రులు తొలుత ఆర్ఎంపీ వద్ద చికిత్స అందించారు. ఆ తర్వాత ఖమ్మంకు తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రహర్షిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
ఖమ్మం – ఎంవీపాలెంలో అప్పటివరకు సరదాగా ఆడుకున్న చిన్నారి ప్రహర్షిక (4) ఒక్కసారిగా కుప్పకూలింది.
నిన్న తల్లి లావణ్య గ్రూప్-3 ఎగ్జామ్స్ రాసి ఇంటికి రాగా ప్రహర్షిక పరిగెత్తుకుంటూ వెళ్లి కిందపడింది.
ఏమైందని అడగ్గా ఛాతిలో నొప్పివస్తోందని… pic.twitter.com/216KFx1C0s
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024