హైదరాబాద్ : నిజనిర్ధారణ(Fact finding) కోసం లగచర్లకు వెళ్లిన మహిళా జేఏసీ నేతలు, సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి గారూ..! ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్యం.. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అని ప్రశ్నించారు.
నిర్బంధాలు లేకుండా మీ పాలనలో రోజు గడవడం లేదని ఎద్దేవా చేశారు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటరు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంత మంది నోళ్లు మూయిస్తరని? సూటిగా ప్రశ్నించారు. అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నడు. నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం.
POW నాయకురాలు సంధ్య గారు, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. @revanth_anumula గారూ..!
ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పాలన.కంచెలు,… https://t.co/nZNAcxoyPW
— Harish Rao Thanneeru (@BRSHarish) November 19, 2024